పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ఈనెల 21న “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమం నందు స్మృతి పరేడ్ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.
రామగుండం సీపీ. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి
ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమిషనరేట్: తెలంగాణ రాష్ట్ర డీ.జీ.పీ ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం “పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వ (తేది :21- 10- 2022 నుండి 31 -10 -2022) వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.
• ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు ,సాంకేతిక వినియోగం,ప్రజల రక్షణ లో పోలీసుల సేవలు, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మొదలగునవి విషయాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.
• వ్యాసరచన పోటీలు కేటగిరీల వారిగా కేటగిరి-1 స్టూడెంట్స్ కు ఇంటర్మీడియట్ వరకు రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర, కేటగిరి-2, డిగ్రీ అండ్ above స్టూడెంట్స్ కు సైబర్ క్రైమ్ నివరణలో పోలీసు, పౌరుల పాత్ర అనే అంశాల మీద విద్యార్థులకు “ఆన్లైన్ నందు వ్యాసరచన పోటీలు” నిర్వర్తించి మొదటి ముగ్గురికి ప్రశంసాపత్రాలు అందజేయడం జరుగుతుంది.
• కేటగిరి-1 కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్.ఐ స్థాయి అధికారి వరకు..పౌరుల మన్నాలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి కేటగిరి-2 ఎస్.ఐ స్థాయి అధికారి మరియు పై స్థాయి అధికారులకు. సమర్ధవంతమైన పోలీసింగ్ లో మహిళ పోలీస్ ల పాత్ర. రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
• పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
• పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుంది
• లఘు చిత్రాలు, ఫోటోల పోటీలు :* పోలీస్ ఫ్లాగ్ డే లో భాగంగా పోలీస్ త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే తక్కువ విడిది గల షార్ట్ ఫిలిమ్స్, ఈ మధ్య తీసిన ఫోటోలు ,ఆర్టికల్ ల పై ఈనెల తేది: 25-10-22 లోపు స్పెషల్ బ్రాంచ్ లో అందించాలి. ఎలాంటి సందేహాలు ఉన్నను సెల్ ఫోన్ నెంబర్ 8712656596 కు సంప్రదించగలరు.
•ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరవీరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందం తో పాటల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
•ఈ నెల అక్టోబర్ 21న పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు “పోలీస్ అమరవీరుల సంస్మరణ లో ఘనంగానివాళులు అర్పిస్తూ “స్మృతి పరేడ్”, ” పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమాలు నిర్వహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.

