Telugu Updates
Logo
Natyam ad

పార్టీ పేరును భాజపా మార్చుకోవాలి: కేటీఆర్ మరో వ్యంగ్యాస్త్రం

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై భాజపా కోర్ కమిటీ సమావేశమైన నేపథ్యంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 15లోపు వస్తుందంటూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తనదైన శైలిలో మరో వ్యంగ్యాస్త్రంతో కూడిన ట్వీట్ చేశారు.
“ఎలక్షన్ కమిషన్ కు ముందే భాజపా నేతలు ఎన్నికల తేదీని ప్రకటిస్తున్నారు. ఈడీ కంటే ముందే సోదాలు చేసే వారి పేర్లు చెబుతున్నారు. ఎస్ఐఏ కంటే ముందే బ్యాన్ విధిస్తున్నారు. ఐటీ అధికారుల కంటే ముందే నగదు వివరాలు చెబున్నారు. సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు వెల్లడిస్తున్నారు. భాజపా తమ పార్టీ పేరును ‘BJ.. EC-CBI-NIA-IT-ED..P’గా మార్చుకోవాలి” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.