Telugu Updates
Logo
Natyam ad

అక్కడి ధాన్యానికి అనుమతి లేదు..?

కోదాడ: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ధాన్యం నియంత్రణకు కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు చెకోపోస్టు ఏర్పాటు చేశారు. ధాన్యం సరఫరా చేస్తున్న వాహనాలను పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యానికి తెలంగాణలోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే బియ్యాన్ని కొనబోమని.. రాష్ట్ర సరిహద్దుల్లో చెకోపోస్టులు ఏర్పాటు చేస్తామని నిన్న మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించిన విషయం తెలిసిందే.