Friday, July 3, 2026
HomeTelanganaవిద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు: సబితా

విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు: సబితా

📰 Generate e-Paper Clip

Post Midle

హైదరాబాద్: తక్కువ మార్కులు వచ్చాయని ఒకరు, ఫెయిల్ అయ్యానని మరొకరు.. ఇలా పలువురు ఇంటర్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు ఏడాది నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులకు తల్లిదండ్రులు మానసిక ధైర్యం ఇవ్వాలన్నారు. లెక్చరర్లు కూడా వారికి ఆత్మస్థైర్యం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.