నూతన ఉపరితల గని ప్రారంభం: జీఎం సంజీవరెడ్డి
ఆసిఫాబాద్ జిల్లా: ఈ ఆర్థిక సంవత్సరంలో రెబ్బెన మండలంలో నూతన గోలేటి ఉపరితల గని ప్రారంభించే అవకాశముందని, అటవీశాఖ ఆధీనంలో ఉన్న 615 ఎకరాల అటవీ భూములకు అనుమతులు వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభమవుతుందని బెల్లంపల్లి ఏరియా జిఎం సంజీవరెడ్డి తెలిపారు. గోలేటి జీఎం కార్యాలయంలో ఏప్రిల్ నెలలో సాధించిన ఉత్పత్తి ఉత్పాదకత లపై పాత్రికేయులతో జరిపిన సమావేశంలో బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలలో నిర్దేశించిన 3. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికిగాను 2. 38 మిలియన్ టన్నులు సాధించిందని తెలియజేశారు..
ఇప్పటివరకు 1027 సీపీఆర్ఎస్ఎస్ మెడికల్ కార్డ్స్ జారీ చేయడం జరిగిందని, హెచ్బీఎల్ ఐఆర్ఎస్ 154, మెడికల్ అన్ఫిట్ 266 మంది కార్మికులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ రాజేంద్రప్రసాద్, డివై పీఎం తిరుపతి, పర్సనల్ మేనేజర్ లక్ష్మణరావు లు పాల్గొన్నారు..