తొలి హైడ్రోజన్ కారులో పార్లమెంటుకు విచ్చేసిన మంత్రి..?
ఆంజనేయులు న్యూస్: పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత తొలి దేశీయ కారులో కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించారు. టయోటా మిరాయ్ పేరుతో ఇటీవలే దేశీయంగా తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత కారును టయోటా ఆవిష్కరించింది. ఈ కారులో తన నివాసం నుంచి పార్లమెంట్ కు బుధవారం మంత్రి గడ్కరీ ప్రయాణించారు. “భవిష్యత్తు హైబ్రోజన్ కార్లదే. ఇది గ్రీన్ హైడ్రోజన్. కిలోమీటర్ కు రూ.1.5 వ్యయం అవుతుంది. దీని జపనీస్ పేరు మిరాయ్. భారత్ ఇంధన పరంగా స్వీయ సమృద్ధి సాధించేందుకు గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎంతో సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన ఇంధనం అవుతుంది” అని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. తాను హైడ్రోజన్ కారునే వినియోగిస్తానని మంత్రి లోగడే ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాని కేంద్ర సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం గమనార్హం..