ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సెమ్సే ఒలంపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఒలంపియాడ్ 2024లో మంచిర్యాల పట్టణంలోని అభ్యాస పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతి వారికి. ప్రత్యేకించి ప్రకటించిన ఫలితాలలో అభ్యాస పాఠశాల నుంచి మూడు స్టేట్ Ist ర్యాంకులు రావడం గమనార్హం. ఈ సందర్భంగా బుధవారం పాఠశాల ప్రిన్సిపాల్ డా॥ సాన సుధతి మాట్లాడుతూ.. తమ పాఠశాల నుంచి 26 స్టేట్ ర్యాంకులు (state 10 లోపు) మరియు 12 జోనల్ ర్యాంకులు వచ్చినట్లు తెలిపారు. మంచిర్యాల పట్టణం నుంచి బెస్ట్ పాఠశాలగా (ఎక్కవ స్టేట్ ర్యాంక్ క్యాటగిరిలో) అభ్యాస పాఠశాల నిల్వటం తమకు ఎంతో గర్వకారనం అన్నారు. ఇదుకు సహకరించిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలపారు..