
మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామంలో స్థానిక బస్ & అటో, స్టాండ్ లో మంచిటి చేతి పంపు చెడి పోవడంతో అధికారులకు అటో కార్మికులు సమాచారం అందించడంతో సంబంధిత మండల బోర్ మెకానిక్ వచ్చి మర్మతుల నిమ్మితం తీసుకెళ్లి దాదాపు నెల రోజులు గడుస్తున్నా సదరు మెకానిక్ రాలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు వర్షాకాలం కావడంతో మంచినీళ్లకు ఇబ్బందిగా మారిందాన్నారు. ఈ సమస్య ను గ్రామపంచాయతీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఎవ్వరికీ పిర్యాదు చేయాలో తెలియడం లేదని అన్నారు.
ఇప్పటికే బోరు స్థలం లో చెత్త పేరుకుపోయి ఉందని మరికొన్ని రోజులైతే చెత్త కుండీ లా అవుతుందని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని సమస్య ను పరిష్కరించాలని కోరుతున్నారు..

