తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన మంచిర్యాల పోలీసులు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో తప్పిపోయిన బాలుడిని బ్లూ కోర్ట్ సిబ్బంది తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని వైశ్య భవన్ సమీపంలో ఆరేళ్ళ బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు గుర్తించారు. వెంటనే డయల్ 100కు కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న బ్లూ కోర్ట్ సిబ్బంది రమేష్, తిరుపతి, రఫీక్ బాలుడి వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అబూబకర్ తన భార్యను ప్రసవం కోసం స్థానిక కార్తికేయన్ ఆసుపత్రికి తీసుకురాగా బాలుడు రోడ్డుపైకి వచ్చి తప్పిపోయినట్లు తెలిపారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులు మరియు స్థానికులు మంచిర్యాల బ్లూ కోర్ట్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

