Telugu Updates
Logo
Natyam ad

మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం జప్తునకు కోర్టు ఆదేశం

ఆంజనేయులు న్యూస్ , మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 40 ఏండ్లుగా ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఈ తీర్పు వెలువరించింది. దీంతో జప్తు ఆపేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని 478, 480 సర్వే నెంబర్లలోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ విషయంలో అధికారులు నిర్లక్యం వహించారు. అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కార్యాలయాలన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశాల జారీ చేసింది. దీంతో జిల్లా అధికారులు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. బాధిత మహిళతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రయత్నం చేస్తున్నారు.