మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే జనార్దన్ పై పందులు దాడి.. స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం
మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణం తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన మద్యం మత్తులో కింద పడి ఉన్న ఇంక్లైన్ బస్తీకి చెందిన కాపిరపు జనార్ధన్(45) అనే వ్యక్తిపై ఆదివారం అర్థరాత్రి పందులు విచక్షణా రహితంగా దాడి చేసి చంపాయని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన మద్యం మత్తులో కిందపడి ఉన్న మృతుడిపై పందులు దాడి చేయడంతోనే ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న బెల్లంపల్లి రూరల్ సీఐ బాబురావు, టూ టౌన్ ఎస్ఐ ఆంజనేయులు విచారణ చేపట్టి మృతి చెందిన వ్యక్తి ఇంక్లైన్ బస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించి కుటుంబ సబ్యులకు సమాచారం తెలియజేసారు. తెల్లవారుజామున మద్యం మత్తులో స్పృహ లేకుండా పడి ఉన్న జనార్ధన్ పై పందులు దాడి చేసి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే జనార్దన్ పై పందులు దాడి చేసి చంపాయని, పలుమార్లు మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు బస్తిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, విచ్చలవిడిగా రోడ్లమీద తిరుగుతుండడంతో వాటికి ఢీకొని ద్విచక్ర వాహనదారులు కిందపడి తీవ్ర గాయాలు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు తెలిపారు. పందుల స్వైర విహారం పై చర్యలు తీసుకోవాలని సమస్యను విన్నవించుకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ధారణం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపించారు.
పందుల దాడిలో ఓ వ్యక్తి మరణానికి కారణం, స్థానికంగా పందుల పెంపకం దారులతో పాటు, సంబంధిత మున్సిపల్ అధికారులేనని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..