Telugu Updates
Logo
Natyam ad

లోన్ యాప్ ల వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా: లోన్ యాప్ ల వేధింపులు భరించలేక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్ వాడకు చెందిన బొల్లు కల్యాణి అనే గృహిణి బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించి ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ పూర్తి వివరాలు వెల్లడించారు. వివిధ యాప్ ల ద్వారా లోన్లు తీసుకున్న మృతురాలు సకాలంలో చెల్లించక పోవడంతో ఆమె ఫోన్ నుండి యాక్సెస్ చేసుకున్న కాంటాక్ట్ నంబర్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా అవమానించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య కు పాల్పడినట్లు వెల్లడించారు.