మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రాంనాథ్ ఐపిఎస్
ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి

ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమిషనరేట్: మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా వచ్చిన మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రాంనాథ్ ఐపిఎస్. మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి అనంతరం అధికారులు స్వాగతం తెలిపారు. తనిఖీ లలో భాగంగా అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణ, పరిసరాలు పరిశీలించడం జరిగింది. రిసెప్షన్, బ్లూ కోల్ట్, క్రైమ్ టీం, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్ , క్రైమ్ రైటర్, ప్రాసెస్, సమన్స్, వారెంట్స్ ఆఫీసర్, సెక్షన్ ఇంచార్జ్, టెక్ టీం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్,ఎస్ హెచ్ ఓ వర్టికల్స్ పనితీరుని CCTNS, Tecdatum, అప్లికేషన్ల పనితీరుని తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను మరియు జపాన్ సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన 5S విధానం అమలు తీరుని తనిఖీ చేసి పోలీస్ సిబ్బంది పని తీరు, ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మరియు పెండింగ్ కేసుల ఫైల్స్, రికార్డులను పరిశీలించారు. అలాగే నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ… మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ లు, నాఖ బందీలు, ఏరియా డామినేషన్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించాలి. నిరుద్యోగ యువత శిక్షణ లు ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, జాబ్ మేళాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలి అని తెలిపారు. పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే వారితో మర్యాదగా మెలాగలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. అదేవిధంగా పాత నెరగాళ్లపై నిఘా ఉంచాలని, 100 డయల్ ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని అన్నారు అలాగే రోజు వారి వాహన తనిఖీలు చేస్తూ రోడ్డు భద్రత నియమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, కోటపల్లి ఎస్ఐ సురేష్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

