
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కొమరం భీమ్ సేవ సమితి ఆధ్వర్యంలో 82వ కొమురం భీం వర్ధంతి కార్యక్రమాన్ని మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ మైదానంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ పాల్గొనడం జరిగింది. ముందుగా కొమురం భీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొమురం భీం వర్ధంతిని అధికారకంగా జరపడం చాలా సంతోషకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖ్య గౌడ్ మాట్లాడుతూ. త్వరలోనే రామ్ చెరువు కట్టమీద కొమురం భీం విగ్రహంతో పాటు మహానుభావులు విగ్రహం ప్రతిష్టకు ఎంపీ, ఎమ్మెల్యే మరియు చైర్మన్ మరియు కౌన్సిలర్ల అందరితో చర్చించి ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
రామ్ చెరువు కట్ట అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడుతూ. ఈరోజు వర్ధంతి కార్యక్రమం అనేది ఒక పండగల జరపడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓం అష్టోత్తర యోగ అధ్యక్షులు మరియు సభ్యులు, టిఆర్ఎస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు సుధీర్ మరియు హైటెక్ సిటీ వాకర్ల అధ్యక్షులు మరియు హమాలివాడ కట్ట వాకర్ల అధ్యక్షులు శంకర్ మరియు ఆర్ ఆర్ నగర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్, వాకర్ క్లబ్ సభ్యులు విగ్నేష్, అనిల్, రాజేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పోటు మధు, మధు, సతీష్, బాక్సింగ్ క్రీడాకారులు కోచ్. రాజేష్ మరియు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

