Telugu Updates
Logo
Natyam ad

జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్ల ఆందోళన.!

హైదరాబాద్ పంజాగుట్ట: హైదరాబాద్ లో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ ఖైరతాబాద్ జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలుషిత నీటిని నివారించాలంటూ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఖాళీ కుండలతో నిరసన తెలిపారు. భాజపా నాయకులు గౌతమ్ రావు, శ్రీశైలంగౌడ్, శ్యాం సుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. “నగరంలో కలుషిత నీళ్లు తాగి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదు. నిజాం కాలంలో వేసిన పైపులైన్లే ఇప్పటికీ ఉన్నాయి కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలను విమర్శించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు?

హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలి. వర్షాకాలం సమీపిస్తున్నా నాలాల్లో పూడిక తీయడం లేదు. శివారు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలను జలమండలి గాలికొదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటర్ బోర్డుకు ఇస్తానన్న రూ.500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కలుషిత నీళ్లు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి. తాగునీటికి, డ్రైనేజీకి కొత్త పైపులైన్లు వేయాలి. పది రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే హైదరాబాదును దిగ్బంధిస్తాం.