Telugu Updates
Logo
Natyam ad

అక్రిడిటేషన్ ల జారీకి దరఖాస్తు గడువు పొడిగింపు..?

జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్

మంచిర్యాల జిల్లా: జిల్లాలో 2022-24 సంవత్సరానికి గానూ జిల్లాలో రెండేండ్ల వ్యవధి గల అక్రిడిటేషన్ కార్డుల కై దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 20 వ తేదీకి పొడిగించినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 సంవత్సరంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు ల గడువు జూన్ 30 వ తేదీ నాటికి ముగుస్తున్న దృష్ట్యా కొత్తగా అక్రిడిటేషన్ కార్డు ల జారీకి అర్హులైన జర్నలిస్టు ల నుండి దరఖాస్తులు ల ఆహ్వానిస్తుట్లు తెలిపారు.

జిల్లాలోని జర్నలిస్టులు సమాచారశాఖ డిపార్ట్మెంట్ వెబ్సైట్ https: //ipr. telangana. gov.in ను సందర్శించి మెనూ కింద చూపించే Media Accreditation లింక్ ను క్లిక్ చేసి జర్నలిస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫారం లో అడిగిన ఫోటోలను, డాక్యుమెంట్ లను జత చేయాలన్నారు. స్టాఫర్ లు జిల్లా, నియోజకవర్గ జర్నలిస్ట్ లు, కన్స్టిట్య్యూన్సీ, మండల విలేఖరులు మండల కేటగిరీ నీ ఎంపిక చేసుకోవాలన్నారు. ఇప్పటికే జర్నలిస్ట్ ల విజ్ఞప్తి మేరకు సమాచార శాఖ రెండు సార్లు గడువు పొడిగించిందనీ తెలిపారు. తాజాగా జిల్లా జర్నలిస్ట్ లకు

ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ గడువు ను జూన్ 20 వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి వర్కింగ్ జర్నలిస్ట్ ల దరఖాస్తులు స్వీకరణ కు జూన్ 15, 2022 వరకు గడువు పొడిగించిందన్నారు. మీడియా సంస్థల ఎడిటర్ లు, మేనేజ్మెంట్ లు తమ లెటర్ హెడ్ పై నామినేటెడ్ జర్నలిస్ట్ ల వివరాలు జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అందజేయాలని కోరారు. ఇండిపెండెంట్ కేటగిరీకి చెందిన జర్నలిస్టులు నేరుగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు..