Telugu Updates
Logo
Natyam ad

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

మంచిర్యాల జిల్లా: లోని రామకృష్ణాపూర్ పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి అఖిల్ మహాజన్ పూర్తి వివరాలు వెల్లడించారు. శనివారం సాయంత్రం ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వీరు పట్టుబడ్డట్లు డిసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. సింగరేణి ఏరియా హాస్పిటల్ దగ్గరలోని ఎక్స్ రోడ్ వద్ద ముగ్గురు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని బైక్ పై గోదావరిఖని వైపు నుండి బెల్లంపల్లి వైపు వెళ్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా అందులో రాంటెంకి సారయ్య అనే వ్యక్తి వద్ద బంగారు ఆభరణాలు దొరికాయి. విచారణలో దొంగలించిన సొత్తును అమ్మేందుకు బెల్లంపల్లికి వెళుతున్నట్లు తేలింది. పట్టుబడిన వారిలో రాంటెంకి సారయ్య అలియాస్ వెంకటేష్, కమ్మటి వెంకటేష్, మానుపాటి శేఖర్ ఉన్నారు. వీరి వద్ద నుండి రూ. 90 వేలు విలువ చేసే 6 తులాల బంగారు నగలు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచనున్నట్లు డిసిపి వెల్లడించారు.

నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ జీవన్, సుధాకర్, సిబ్బంది సంపత్ కుమార్, మల్లేష్, రమేష్ లను అభినందించి రివార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సిఐ ఎస్. ప్రమోద్ రావు, ఎస్ఐ జి. సుధాకర్ పాల్గొన్నారు..