Friday, July 3, 2026
HomeTelanganaఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్..?

ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్..?

📰 Generate e-Paper Clip

Post Midle

ఆదిలాబాద్ జిల్లా: ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందనే ప్రచారం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లాలెకిడీలో ఇంటర్ ఒకేషనల్ పరీక్షలో శనివారం మాస్ కాపీయింగ్ జరిగిందని తెలుస్తోంది. ఎగ్జామ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నాపత్రం బయటకు పంపించడం, ఆ వెంటనే కొందరు జవాబులు పంపించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఆ జవాబు చీటీలను తీసుకుని విద్యార్థులు పరీక్ష రాశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వీటికి ఇన్విజిలేటర్లు కూడా సహకరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.