
సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్లను గురువారం ఆర్టీసీ ఎండి సజ్జనార్ దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎండి సజ్జనార్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆలయ ఈవో రమాదేవి, అదనపు ఎస్పీ చంద్రయ్యలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. ఆలయ అధికారులు సైతం ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు నాగిరెడ్డి మండపంలో వారిని ఆశీర్వదించారు..


