Thursday, July 2, 2026
HomeTelanganaసంబంధిత శాఖల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

సంబంధిత శాఖల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారం కొరకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుంది.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారం కొరకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి అనూష తాను 2016లో దేవాపూర్ గ్రామంలో ఇల్లు కొనుగోలు చేశామని, ఇట్టి ఇంటి సంబంధిత వివరాలను గ్రామపంచాయతీ ద్వారా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పోచంపల్లి హరీష్ బెల్లంపల్లి మండలంలో అనేక ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఈ విషయమై విచారణ జరిపి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. జన్నారం మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన సదాల గంగయ్య తన తండ్రి జీవించి ఉన్న కాలంలో తన పేరిట గల భూమిని ఒక వ్యక్తికి కౌలుకు ఇవ్వడం జరిగిందని, తన తండ్రి చనిపోయిన తర్వాత అట్టి భూమిని ఆ వ్యక్తి తన పేరిట మోసపూరితంగా పట్టా చేసుకోవడం జరిగిందని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కోటపల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన సోదరి మల్లయ్య, సోదరి వెంకటేష్ లు ఎస్.సి. నేతకాని కులానికి చెందిన తమకు గ్రామ శివారులో గత ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని పట్టా చేయాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు. భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామానికి చెందిన దోని తారక్క కూలి పని చేసుకుంటూ జీవించే తనకు భర్త చనిపోయినందున వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గద్దల వెంకటయ్య తన కూతురు మేఘమాల టి.ఎస్.డబ్ల్యు. ఆర్.డి.సి. (డబ్ల్యు) మంచిర్యాల నందు డిగ్రీ చదువుతుండగా ద్వితీయ సంవత్సరంలో అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొంది ఇప్పుడే కోలుకుంటుందని, తృతీయ సంవత్సరం పరీక్షలు ఇంటి వద్ద నుండి వ్రాయుటకు అనుమతి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామానికి చెందిన పంబాల శశిరేఖ, యాటకాల లక్ష్మి, పంబాల తిరుపతమ్మ తమకు గ్రామ శివారులో భూమి కలిగి ఉన్నామని, పట్టాదారు పాసు పుస్తకంతో పాటు, రైతుబంధు పథకం పొందామని, ఇట్టి భూమిని వేరొకరు వారి భూమి అని అంటూ కోర్టులో కేసు వేయడం జరిగిందని, మాకు ఇట్టి భూమి తాతల నుండి వచ్చిందని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు. లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఎం.డి. ఇమామ్ బి, ఎం.డి. మెహబూబ్ బి, ఎం.డి. లాల్ బి లు తమ దరఖాస్తులో తమ తల్లికి చెందిన భూమిని ముగ్గురి పేరిట సమానంగా పట్టా చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి రామచంద్రయ్య తనకు గ్రామ శివారులో భూమి ఉందని ఇట్టి భూమి నుండి నీరు బయటకు వెళ్లకుండా పలువురు వ్యక్తులు వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ విషయమై విచారణ జరిపి నాలా నుండి నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయే విధంగా ఏర్పాటు చేసి రైతులను కాపాడాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన గట్టు పద్మ తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉ న్నారని, తన భర్తకు కాలు విరిగి ఆపరేషన్ జరిగిందని, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్న తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.