Thursday, July 2, 2026
HomeTelanganaప్రజలకు సహాయం అందిండానికి పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు: డీఎస్పీ

ప్రజలకు సహాయం అందిండానికి పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు: డీఎస్పీ

📰 Generate e-Paper Clip

Post Midle

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: ప్రజలకు అవసరమైన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ పోలీసులు అండగా ఉంటామని కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ అదేశాలమేరకు చింతలమానేపల్లి మండలం చిత్రాం గ్రామంలో నిరుపేద ఆదివాసీ, గిరిజనులు దళితులకు పోలీసులు మీకోసం అధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ గ్రామంలోని 30 మంది వృద్ధులు, ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి 10కిలోల బియ్యం, ఒక కిలో వంట నూనె, రెండు సబ్బులు, కూరగాయలు, కారం, పసుపు, ఉప్పు అందించారు.

అలాగే దిందా, కేతిని, చిత్తాం యూత్ కు వాలీబాల్ కిట్లను కౌటల సీఐ బుద్దే స్వామి, చింతలమానేపల్లి ఎస్ఐ విజయ్ తో కలిసి అందజేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదని గ్రామస్తులు డీఎస్పీ దృష్టికి తీసుకు రాగా, గ్రామానికి రోడ్డు సౌకర్యాన్ని పోలీసు శాఖ తరపున కృషి చేస్తామని అన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.