Telugu Updates
Logo
Natyam ad

బహిరంగ వేలానికి భారీగా స్పందన: ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా: పోలీసుల అధీనంలో ఉన్న అన్నోన్, స్క్రాప్ ( ఎందుకూ ఉపయోగపడని) వాహనాల బహిరంగ వేలం శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ వేలంపాటానికి ప్రజలు, వ్యాపారులు భారీగా పాల్గొన్నారు. పోలీసుల ఆధీనంలో ఉన్న ఎవరు గుర్తించినటువంటి, ఎవరికి సంబంధించినవో తెలియని, ఎవరు తీసుకొని వెళ్ళని వాహనాలను ప్రభుత్వం ఆదేశానుసారం ఆరు నెలల గడువు మే 30తో ముగిసింది. కావున ఎవరు స్పందించనందున వాటిని శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ద్వారా నియమించిన కమిటీ నిర్ణయించిన 116 వాహనాలను 5 లాట్స్ ( భాగాలుగా) విభజించారు. మొత్తం 108 ద్విచక్ర వాహనాలను నాలుగు లాటుగా విభజించడం మరియు 5 ఆటోలు, రెండు కార్లు, ఒక వ్యాన్ ను ఒక లాటుగా విభజించి వేలం పాట నిర్వహించగా అందులో మొత్తం వాహనాలకు సంబంధించి రూ 10,07, 000/- డబ్బును కొనుగోలు దారులు చెల్లించి వాహనాలను తీసుకెళ్లడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

ఈ వేలంపాటలో జిల్లా ఎస్పీ ద్వారా నియమించబడిన కమిటీ సభ్యులు అయిన ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, పట్టణ డిఎస్పి వి ఉమెందర్, ఏఆర్ డిఎస్పి ఎం విజయ్ కుమార్, ఒకటవ పట్టణ సీఐ పి సురేందర్, ఉట్నూర్ సిఐ సైదారావు, పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి ఎం డి యునస్ అలి, ట్రాఫిక్ సిఐ కె మల్లేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, బి శ్రీపాల్, ఎం వంశీకృష్ణ, బి. సూపరిండెంట్ ఏవిఎన్ చారి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..