Telugu Updates
Logo
Natyam ad

భారీగా గంజాయి స్వాధీనం..?

ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలో పోలీసులు భారీగా  గంజాయి పట్టుకున్నారు. ఒడిశా నుంచి ఖమ్మం మీదుగా రాజస్థాన్ తరలిస్తున్న రూ.75 లక్షల విలువైన 250 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ  కేసుకు సంబంధించిన వివరాలను ఖమ్మం సీపీ విష్ణు వారియర్ వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని.. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు. మాదకద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా సీపీ చెప్పారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు..