
ఆదిలాబాద్ జిల్లా: ‘తాంసీ మండలంలోని వడ్డాడి ప్రాజెక్టు వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహం స్థానికులు గమనించారు. గురువారం ప్రాజెక్ట్ గేట్లను చిక్కుకొని ఉన్న ఓ వ్యక్తి మృతదేహం ను గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం ఎవరిది అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. కాగా మృతునికి సంబంధించిన రెండు చేతులు, అదేవిధంగా నోటికి తాళ్లతో కట్టేసి ఉంది. మృతుని చేతులు, నోటిని ఎవరైనా కట్టేసి హత్య చేసి ప్రాజెక్టు లో పడవేశార అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. మృతుడు ఇక్కడి వ్యక్తి, లేదా భారీ వరద నీటి కి కొట్టుకు వచ్చి ప్రాజెక్టు గేట్ల వద్ద ఆగింద అనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా మృతుడు కాఫీ కలర్ ప్యాంటు, రెడ్ కలర్ బనీన్ వేసుకుని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

