Friday, July 3, 2026
HomeTelanganaగ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన మొక్క నాటిన జిల్లా ఎస్పీ

గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన మొక్క నాటిన జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

Post Midle

ఆదిలాబాద్ జిల్లా: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి ఎస్పి రమణ కుమార్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి ఇందులో భాగంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయం నందు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన ఈ చాలెంజ్ లో ఈరోజు మొక్కలు నాటడం జరిగిందని, తాను ఈ ఛాలెంజ్ ను ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పీ సి. హెచ్ ప్రవీణ్ కుమార్, మంచిర్యాల్ అడిషనల్ డిసిపి అఖిల్ మహాజన్ లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చెట్లు మానవాళికి, మనిషి మనుగడకు జీవనాధారం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి చెట్లను పెంచడం, వాటిని సంరక్షించడం చేయాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీలు ఉమేందర్, విజయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, శ్రీపాల్, వంశీకృష్ణ, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ గుణవంతురావ్ రిజర్వ్ సిబ్బంది పోలీసు కార్యాలయం ఏవో యూనిస్ అలి, సూపర్డెంట్ జోసెఫిన్, తదితరులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.