Thursday, July 2, 2026
HomeTelanganaమంచిర్యాలలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

మంచిర్యాలలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

📰 Generate e-Paper Clip

ఇసుక రవాణా జోరుగా సాగుతున్నాయి.

పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు

Post Midle

లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న దళారులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అడపాదడపా చర్యలు తీసుకుంటున్నా. ఎక్కడా రవాణా మాత్రం ఆగడం లేదు. మరికొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడం, ఇంకొన్ని చోట్ల అక్రమార్కులతో యంత్రాంగం కలిసిపోవడంతో ఇసుకను అక్రమంగా తోడేస్తు లక్షలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మంచిర్యాల పట్టణంలో గ్రీన్ సిటీ వెళ్లే దారి రాళ్లవాగులో ఇసుక అక్రమ రవాణ దందా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం డిసిపి ఆఫీసు కూతవేటి దూరంలోనే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అక్రమ దందాలను అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.