Telugu Updates
Logo
Natyam ad

గోదావరి నది ఉధృతిని పరిశీలించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా: చెన్నూరు మండలంలోని అర్జునగుట్ట రోడ్డు వద్ద గోదావరి నది ఉదృతిని గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీతో కలిసి గోదావరికి అవతలి వైపు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న అక్కేపల్లి, చింతలపల్లి, ఎర్రాయిపేట్, బోరంపల్లి, కొల్లూరు, రాంపూర్, దేవులవాడ, బబ్బెరు చెలుక, రాపన్ పల్లి, అర్జునగుట్ట, లక్ష్మీపూర్ గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఐదుగురిని బోట్ సహాయంతో చెన్నూరు పట్టణానికి తరలించారు.