Telugu Updates
Logo
Natyam ad

ఉచిత శిక్షణ తరగతుల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

మంచిర్యాల జిల్లా: బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతుల రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 30 వరకు పొడగించినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. గురువారం ఆయన మందమర్రిలోని సీఐఎస్ఎఫ్ క్వార్టర్లలో ఉచిత శిక్షణ తరగతుల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే 1 నుండి ప్రారంభమయ్యే ఉచిత కోచింగ్ కు ఆసక్తిగల యువతీ, యువకులు ఈనెల 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించనున్న నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్, మందమర్రి పట్టణంలోని సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ లో రెండు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత కోచింగ్ సెంటర్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డిఎస్సి, SI, కానిస్టేబుల్ తో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ అందించబడుతుందని వెల్లడించారు..

చెన్నూరు మున్సిపాలిటీ, మండలం, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల యువతీ యువకులు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, క్యా తనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లోని యువతీ యువకులు క్యాతనపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కోచింగ్ సెంటర్ కు వచ్చే యువతీ, యువకులకు ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయంతో పాటు నోట్ బుక్స్ మరియు స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు..