Telugu Updates
Logo
Natyam ad

ఐదు రాష్ట్రాల ఫలితాలు తెలంగాణ భాజపాలో ఉత్సాహాన్ని నింపాయి: బండి సంజయ్

హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ లో 35 ఏళ్ల రాజకీయ చరిత్రను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరగరాశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్, లక్ష్మణ్ తో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల్లో భాజపాకు ఓటేసిన ప్రజలకు ఈ సందర్భంగా సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి రహిత పాలన కావాలని యూపీ ప్రజలు భావించారని.. అందుకే యోగి ఆదిత్యనాథ్ ను గెలిపించారన్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు తెలంగాణ భాజపా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు. దేశంలో భాజపా పని అయిపోయిందని కొందరు చేసిన వ్యాఖ్యలకు ఇవాల్టి ఫలితాలే బుద్ధి చెబుతాయన్నారు..