Friday, July 3, 2026
HomeTelanganaఆర్థిక సంవత్సర రుణ లక్ష్యం వేల కోట్లు.?

ఆర్థిక సంవత్సర రుణ లక్ష్యం వేల కోట్లు.?

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల జిల్లా: బ్యాంకర్లకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి మహిపాల్రెడ్డితో కలిసి బ్యాంకుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా ఆర్థిక రుణ ప్రణాళికలో స్వల్పకాలిక రుణాలు 1 వేయి 951 కోట్ల రూపాయలు, వ్యవసాయ ధీర్ఘకాలిక రుణాలు 952 కోట్ల రూపాయలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలు 687 కోట్ల రూపాయలు, వ్యవసాయ రుణాలకు 120 కోట్ల రూపాయలు, ప్రాధాన్యత రంగ గృహ రుణాలకు 237 కోట్ల రూపాయలు, మొత్తం ప్రాధాన్యతా రంగాలకు 3 వేల 996 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ణయించగా ప్రాధాన్యేతర రంగాలకు 299 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 4 వేల 295 కోట్ల రూపాయలు రుణాలను లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు.

8 వేల 333 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు గాను 358 కోట్ల రూపాయలు, పి.ఎం.ఎఫ్.ఎం. ఈ. లక్ష్యం 60 యూనిట్లు లక్ష్యంగా ఆయా బ్యాంకుల వారిగా నిర్దేశించడం జరిగిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సి.డి. రేషియో 84.95 శాతంగా ఉందని, ఖరీఫ్ సీజన్లో పంట రుణాల లక్ష్యం 853 కోట్ల రూపాయలు కాగా 37.15 శాతంతో 316 కోట్ల రూపాయలు, వ్యవసాయ ధీర్ఘకాలిక రుణాల లక్ష్యం 805 కోట్ల రూపాయలకు గాను 103 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అందించే రుణ సదుపాయం వార్షిక లక్ష్యం 686 కోట్ల రూపాయాలు కాగా ఇప్పటి వరకు 97 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి అందించే రుణ వార్షిక లక్ష్యం 3 వేల 996 కోట్ల రూపాయలకు గాను 630 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, ప్రాధాన్యేతర రంగాల రుణ వార్షిక లక్ష్యం 520 కోట్ల రూపాయలకు గాను 57.4 శాతంతో 299 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందని తెలిపారు. 9 వేల 374 స్వయం సహాయక సంఘాలకు అందించే వార్షిక రుణ లక్ష్యం 421 కోట్ల రూపాయలు కాగా 2 వేల 876 సంఘాలకు 161 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముద్ర రుణ సదుపాయం క్రింద 1 వేయి 413 మంది లబ్దిదారులకు 22.74 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 75 యూనిట్ల లక్ష్యంకు గాను 35 యూనిట్లకు రాయితీ రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్.సి. కార్పొరేషన్ పథకంలో భాగంగా 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 122 మంది లబ్దిదారులకు సంబంధించి గ్రౌండింగ్ చేయవలసి ఉందని, జిల్లాలో ఎన్.పి.ఎ. క్రింద 118 కోట్ల రూపాయలు వసూలు చేయవలసి ఉందని, ఎస్.టి. కార్పొరేషన్ రుణాలను సకాలంలో గ్రౌండింగ్ చేయాలని, సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం రైతులు, వ్యాపారస్తులు, పి.ఎం.ఈ.జి.పి., ఎస్.సి., ఎస్.టి. కార్పొరేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పథకాల కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. వ్యవసాయ సాగుకు సంబంధించి రుణాలు పొందిన రైతులు సకాలంలో తిరిగి చెల్లించి అవసరమైన నూతన రుణాలు పొందేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, ఆర్.బి.ఐ. ఎ.జి.ఎం. రాజేంద్రప్రసాద్, డి.డి.ఎం. తేజ్ రెడ్డి, ఆర్.ఎస్.ఈ.ఏ.టి. ఉట్నూర్ సంచాలకులు కె. లక్ష్మణ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ హెడ్ వంశీకృష్ణ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మురళీమనోహర్రావు, యు.బి.ఐ. మేనేజర్ గౌతమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సాగర్రావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.