Thursday, July 2, 2026
HomeTelanganaపండుగ నేపథ్యంలో పాట ఆవిష్కరణ

పండుగ నేపథ్యంలో పాట ఆవిష్కరణ

ప్రకృతి ని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ

బతుకమ్మ పాట ఆవిష్కరణ చేస్తున్న అంజనీ పుత్ర చైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర పండుగ, ప్రకృతి ని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని అంజనీ పుత్ర సంస్థ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని అంజనీపుత్ర కార్యాలయం లో “రాయే రాయే పూల వర్షమా” బతుకమ్మ పాట ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్బంగా చైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి మాట్లాడుతూ.. రాష్ట్ర పండుగ బతుకమ్మ అనీ, ప్రకృతిని పూజించే సంస్కృతి ప్రపంచంలో అత్యంత అరుదైన ప్రత్యేకత కలిగిన పండుగని పేర్కొన్నారు. మహిళ సోదరీమణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాట ను ప్రతిఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర డైరెక్టర్లు, నేపథ్య గాయనీ నిరోషా యాదవ్, సంగీత దర్శకుడు మామిండ్ల లక్ష్మణ్, మిట్ట పెల్లి వెంకటేష్, హరీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

• విద్యార్థులకు దుస్తుల పంపిణీ

జిల్లా లోని చెన్నూరు టీఎస్ డబ్ల్యుఆర్జేసీ బాలికల హాస్టల్ లో నిర్వహించిన 9వ జోనల్ స్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి అంజనీ పుత్ర సంస్థ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ముఖ్య అతిథులుగా పాల్గొని అంజనీ పుత్ర సంస్థ తరపున 100మంది విద్యార్థినులకు దుస్తులు, టీ షర్టులు, క్యాపులు పంపిణి చేశారు. క్రీడా కారిణులకు శుభాభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో క్రీడా కారుకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.