Telugu Updates
Logo
Natyam ad

ఇద్దరు నకిలీ నక్సలైట్ల అరెస్టు..?

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా లోని శనివారం రోజు పాత బస్టాండ్ సమీపంలో పోలీసు వారిని చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోవుచుండగా వారిని వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద ఒక కంట్రీ మేడ్ ఎయిర్ పిస్టల్ లభించగా వారిని పట్టుకుని విచారించగా వారి పేర్లు వావిలాల సాయికుమార్ తండ్రి: రాజమల్లు, వయసు 28 సంవత్సరాలు కులం పద్మశాలి నివాసం: గణేష్ నగర్, సిరిసిల్ల కాశవేణి శేఖర్ తండ్రి: రాజలింగయ్య, వయస్సు 35 సంవత్సరాలు కులం: గొల్ల నివాసంసుద్దాల మండలం కోనరావుపేట అని తెలిపి వీరు శనివారం రోజు తమ వద్ద గల తుపాకీ చూపించి నక్సలైట్లము అని చెప్పి పార్టీకి చందా కావాలని వ్యాపారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం. గురించి పాత బస్టాండ్ వద్ద కలుసుకొని మాట్లాడుకునుచున్నాము అని తెలిపినారు. ఇందులో సాయికుమార్ గతంలో జనశక్తి పార్టీ లో పనిచేసి కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో అరెస్టయి జైలుకు పోయి వచ్చినాడు. ఇతను గతంలో సుద్దాల కు చెందిన శేఖర్ యొక్క బాబాయ్ అగు మొండయ్య దగ్గర తుపాకీ తీసుకున్నాడని మొండయ్య గత సంవత్సరం కరోనా తో చనిపోయాడని అట్టి తుపాకీ చూపించి డబ్బులు వసూలు చేయాలని సాయికుమార్ శేఖర్ కలిసి ముఠాగా ఏర్పడినారు. ఇట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చి కేసు నమోదు చేయనైనది వీరిని కోర్టు వారి ముందు హాజరు పబడుతుంది. అని టౌన్ సి. ఐ అనిల్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలు ఎవరుకుడా భయపడవద్దు అని జిల్లాలో ఎలాంటి జనశక్తి సంచారం లేదు అని అన్నారు. అలాంటి సమాచారం ఉంటే దగ్గరలో గలా పోలీస్ స్టేషన్ లో సమాచార ఇవ్వాలని సూచించారు. ప్రజలను కానీ వ్యాపారస్తులను కానీ జనశక్తి పెరు మీద ఎవరన్నా ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే సమాచారం అందివ్వాలని వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని అన్నారు.