కాగజ్నగర్: సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ రైలులో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇద్దరు స్నేహితులు రైల్లో ప్రయాణిస్తుండగా వారి మధ్య ఘర్షణ తలెత్తింది. రైలు మంచిర్యాల సమీపంలోకి రాగనే అందులో ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి తుపాకి తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపాడు. ఇది గమనించిన టీసీ.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. కాల్పులు జరిపిన వ్యక్తిని కాగజ్ నగర్ రైల్వేస్టేషన్ లో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘర్షణ పడిన ఇద్దరూ ఆర్మీలో పనిచేస్తున్నట్లు సమాచారం..
