
మంచిర్యాల జిల్లా: ఏఐసిసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వ్యక్తిగత ఆరోపణలు చేయడం శోచనీయమని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్య నారాయణ, మున్సిపల్ డిప్యూటీ ప్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మునిగిపోతున్న ప్రాంతంలో స్మశాన వాటిక నిర్మించడం సబబు కాదంటూ చేసిన సూచనలపై ఎమ్మెల్యే ఆరోపణలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. మంచిర్యాలలో ఎవరు గుండాయిజం చేశారో ఆధారాలతో నిరూపించడానికి బహిరంగ చర్చకు ఎమ్మెల్యే ఎందుకు ముందుకు రావడం లేదని వారు ప్రశ్నించారు. నీతి నిజాయితీ ఉంటే బహిరంగ చర్చకు ఎమ్మెల్యే ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు. అసత్య ప్రచారాలు చేస్తున్న ఎమ్మెల్యే పై న్యాయస్థానంలో కేసు వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.
ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్ రామగిరి బానేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అద్యక్షులు, కౌన్సిలర్ సల్ల మహేష్, పట్టణ ఉపాధ్యక్షులు సదానందం, కొండ శేఖర్, పూదరి ప్రభాకర్,. తూముల వెంకటేష్, మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు కవాడి పల్లవి, ఆడేపు శ్యామల, శైలజ, పుట్ట లావణ్య, స్రవంతి, సరస్వతి, కళావతి, లలిత, తదితరులు పాల్గొన్నారు.

