హైదరాబాద్: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే (కాంగ్రెస్) పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే (తెరాస) రేగా కాంతారావుల మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి జిల్లాలో ఐదు సీట్లు కాదు కదా.. నువ్వు కూడా గెలవలేవంటూ పొదెం వీరయ్య రేగాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నీ స్థానంలోనూ నిన్ను గెలవనివ్వనంటూ సవాల్ విసిరారు. పొదెం చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పొదెం వీరయ్య గెలవలేరని.. మరో నియోజకవర్గం చూసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల తర్వాత నీ అడ్రస్ ఎక్కడో చూద్దామంటూ వీరయ్యకు రేగా కాంతారావు ప్రతిసవాల్ విసిరారు. రేగా వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. .