
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మందమర్రి మండలంలోని 2, 3 జోన్ పరిధిలో పిచ్చి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి. సోమవారం రాత్రి బాలుడిపై ఓ పిచ్చి కుక్క దాడి చేయగా తొడ, వీపు తదితర భాగాల్లో గాయాలు అయ్యాయి. వెంటనే ఆ బాలుడి తల్లి తండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇన్ని దాడులు జరుగుతున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం సిగ్గు చేటని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

