
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ విద్యుత్ బకాయిల వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ విద్యుత్ సంస్థలకు రూ. 7వేల కోట్లు తెలంగాణ చెల్లించాలని కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదంపై తీవ్రమైన చర్యలకు దిగవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వాదనలు వినకుండా ఏపీకి చెల్లించాలని ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ విద్యుత్ సంస్థలను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది.

