Telugu Updates
Logo
Natyam ad

జిల్లా స్థాయి లో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా స్థాయి ఎస్.జి.ఎఫ్ కరాటే పోటీలలో స్థానిక ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జోనల్ లెవల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలుర 14 సంవత్సరాల విభాగంలో 8వ తరగతి చదువుతున్న కె. సుప్రతిక్ వర్మ, 6వ తరగతి చదువుతున్న టి. రుగ్వేద్, జె. హర్షవర్ధన్, మరియు 17 సంవత్సరాల విభాగంలో 9వ తరగతి చదువుతున్న టీ. హెచ్. విష్ణువర్ధన్ మరియు షైక్ వసీం, విభాగంలో జిల్లా స్థాయి నుండి జోనల్ విభాగం పోటీలకు అర్హత సాధించినట్లు  తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలు, కళారంగంలో రాణించి తమదైన శైలిని చాటాలన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అభినందించారు.