Friday, July 3, 2026
HomeAndhraటోకెన్లు ఉన్న భక్తులకే మొదట దర్శనం..

టోకెన్లు ఉన్న భక్తులకే మొదట దర్శనం..

📰 Generate e-Paper Clip

ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు

Post Midle

తిరుమల: తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్ల ద్వారా మంగళవారం వరకు టోకెన్లు పొందిన భక్తులకే మొదట స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్ బాబు తెలిపారు. టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం లైన్లో వచ్చే భక్తులను తర్వాత అనుమతిస్తామని చెప్పారు. వీరికి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముందున్న కంప్యూటర్ స్కానింగ్ కేంద్రంలో లడ్డూ టోకెన్లు జారీచేశారు. అప్పటికప్పుడు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను ఏర్పాటుచేసి ప్రతి భక్తుడూ ఒక లడ్డూ పొందేలా టోకెన్లు అందించారు. స్వామివారి దర్శనానంతరం ఈ టోకెన్లతో ఉచిత లడ్డూ తీసుకోవచ్చు. ఒక్కరోజులో 25 వేల లోపు భక్తులు వస్తే అదేరోజు దర్శనం చేయిస్తామని, 60 వేలు దాటి వస్తే సుదీర్ఘ సమయం పడుతుందని పేర్కొన్నారు. అప్పటి వరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండే వారికి నీరు, అన్నప్రసాదాలు అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేపట్టామని రమేశ్బాబు వెల్లడించారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.