Telugu Updates
Logo
Natyam ad

కలుషిత నీరు కలకలం..?

వడ్డెర బస్తీలో 51కి చేరిన బాధితులు..

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. మాదాపూర్ గుట్టబేగంపేట్ వడ్డెడెర బస్తీలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య 51కి చేరింది. వీరందరికీ కొండాపూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. బాధితులెవరికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వడ్డెర బస్తీలో ఓ వ్యక్తి వాంతులు విరేచనాలతో నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. అస్వస్థతకు కారణం కలుషిత నీరేనని, పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.