Telugu Updates
Logo
Natyam ad

ఢిల్లీలో ప్రారంభమైన సీఎం కేసీఆర్ దీక్ష..!

డిల్లీ: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో  తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ భవన్ వేదికగా సాగుతున్న ఈ దీక్షకు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన సీఎం కేసీఆర్ తొలుత పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం దీక్షలో కూర్చున్నారు. ఈ నిరసన దీక్షకు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ కూడా వచ్చారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ చేపడుతున్న ఈ దీక్షకు మద్దతుగా ట్విట్టర్ లో రాకేష్ టికాయత్ పోస్ట్ పెట్టారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గు చేటని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకే విధానం లేకపోవడం వల్ల రైతులు రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి తలెత్తుతోందన్నారు..