Telugu Updates
Logo
Natyam ad

కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ!

దిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. దేశ రాజధాని పర్యటనలో ఉన్న కేసీఆర్ దిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఈ విందు సమావేశంలో.. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి తదితర అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది..

మధ్యాహ్న భోజనం తర్వాత కేజ్రీవాల్, కేసీఆర్ చండీగఢ్ వెళ్లనున్నారు. సాగు చట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను సీఎంలు పరామర్శించనున్నారు. అమరులైన రైతు కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా పాల్గొననున్నారు..