Telugu Updates
Logo
Natyam ad

బన్నీపై ట్వీట్ చేసిన చిరు.. నిమిషాల్లో రియాక్షన్..! రియాక్షన్..!

హైదరాబాద్: ‘పుష్ప’ విజయంతో పాండియా స్థాయిలో స్టార్ డామ్ గా సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న బన్నీ ప్రస్తుతం తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. శుక్రవారం బన్నీ పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు సినీతారలు, దర్శకనిర్మాతలు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన మేనల్లుడినీ ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. “హ్యాపీ బర్త్ డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్మార్క్ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో” అని చిరు పేర్కొన్నారు. చిరు చేసిన ట్వీట్ పై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లైక్స్, రిట్వీట్స్ రూపంలో తమ రియాక్షన్స్ తెలియజేస్తున్నారు. అలా కొన్ని క్షణాల్లోనే ఈ ట్వీట్ ని 8800మంది లైక్ చేయగా, సుమారు 2200 మంది రీట్వీట్ చేశారు..