చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలి
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్
రంగారెడ్డి జిల్లా-కేశంపేట: అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు.గురువారం ఆయన కేశంపేట మండలంలోని పాపిరెడ్డి గూడ,చౌలపల్లి,బోదునంపల్లి గ్రామాల్లో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేశారు.అంగన్వాడీ కేంద్రాలలో అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న ఆహారాన్ని ఆయన పరిశీలించారు.అంగన్వాడీ టీచర్లు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉండడంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తినలేకపోతున్నారని చిన్నారుల తల్లులు జేసి దృష్టికి తీసుకువచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ వీలైతే అంగన్వాడీ కేంద్రాల వద్దనే అన్నం వండించేందుకు ప్రయత్నిస్తామన్నారు.రక్తహీనత ఉన్న చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. వారి ఎదుగుదల గురించి,అందించాల్సిన పౌష్టికాహారం గురించి తల్లిదండ్రులుకు అవగాహన కల్పించాలన్నారు.త్వరలోనే ప్రతి అంగన్వాడీ వద్ద మరుగుదొడ్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు.జేసితోపాటు అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీలలో పాల్గొన్నా జడ్పిటిసీ తాండ్ర విశాల శ్రావణ్ కుమార్ రెడ్డి పాపిరెడ్డిగూడ అంగన్వాడీకి ఫ్యాన్ బహుకరించారు.
ఈకార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,ఎగిరె కలమ్మ వెంకటయ్య,ఐసిడిఎస్ పీడీ మోతి,సీడీపీఓ నాగమణి, అంగన్వాడీ టీచర్లు జయమ్మ, వినోదమ్మలతోపాటు తదితరులు పాల్గొన్నారు.