సిసి రోడ్లు ప్రారంభించిన: ఎంపీ
మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో రూ. 11 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను శుక్రవారం పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ నేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొన్నారు..