సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని శ్రీకృష్ణ నగర్ లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, మాజీ కౌన్సిలర్ పడాల రామన్న, నాయకులు దుర్గం స్వామి, కర్రు శంకర్, పడాల మాధవి శ్రీనివాస్, ఒలం రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు..