
హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనల పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరో సారి స్పందించారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులకు లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. “ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారనే నా ఆవేదన. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దు. విద్యార్థుల ఆందోళనలు చూస్తే మంత్రిగా, ఓ అమ్మగా బాధేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం, ఉన్నత పరిష్కారం కోసం డైరెక్టర్ ని నియమించాం. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణను ప్రభుత్వం మీ వద్దకు పంపింది. ఇది మీ ప్రభుత్వం దయచేసి చర్చించండి” అని లేఖలో పేర్కొన్నారు..

