Telugu Updates
Logo
Natyam ad

అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష: బాల్క సుమన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష గట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. భాజపా అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సుమన్ మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే.. భాజపా నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దెబ్బతీసేలా మాట్లాడారన్న ఆయన రైతుల సంక్షేమం కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు.