Telugu Updates
Logo
Natyam ad

బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ప్రారంభం

మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే, జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో బాల్క ఫౌండేషన్ సహకారంతో మందమర్రి పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారక్ లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆదివారం శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సంకశాల మల్లేశం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎసిపి ఎడ్ల మహేష్, మున్సిపల్ కమిషనర్ రాజు, సింగరేణి జిఎం చింతల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..