
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పోలీసు స్టేషన్ లో బ్లూ కోర్ట్ కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్న గంగాధరి సత్యనారాయణ కు ఉత్తమ సేవలు అందించినందుకు పురష్కారం లభించింది. గురువారం నిర్వహించిన ఘనతంత్ర దినోత్సవేడుకలలో భాగంగా ప్రశంసా పత్రాన్ని మంచిర్యాల ఇంచార్జీ డిసిపి అఖిల్ మహాజన్ చేతుల మీదుగా అందజేశారు. పట్టణ ప్రజలతో స్నేహా భావంగా ఉండడంతో పాటు ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించి, ప్రజలతో ఆధికారుల మన్ననలు పొందడం ఎంతో ఆనందించాల్సిన విషయం. పోలీసులంటే ప్రజలలో ఉన్న భయాన్ని లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో ఉద్యోగ సేవలు అందించి అందరి వాడుగా ఉన్నందుకు అధికారులు, ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

